Tuesday, October 25, 2011

అనుక్షణం నీ కోసం



నీ కోసం అనుక్షణం ఆలోచించాను.. నీవు లేకుండా బ్రతకలెననుకున్నాను.. నీతో మాట్లాడాలని నీ ఫ్రెండ్ కి ఫోన్ కూడా చేశాను. "మల్లి ఫోన్ చేయొద్దు" అని వార్నింగ్ ఇచ్చావ్. నా నిరీక్షణకు ఇలాంటి సమాధానం వస్తుందని అనుకోలేదు.. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎన్నో సార్లు అనిపించింది. కానీ చూడలేను.. మాట్లాడలేను.ఎలాగైనా నిన్ను చూడాలని హైదరాబాద్ నుంచి గుంటూరుకి బదిలీ చేయించుకున్నాను. ఆరు నెలలు ఎదురు చూసాను.నీ నుంచి సమాధానం లేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నీ కోసం గుంటూరు వచ్చిన నాకు అక్కడా పరాభవం ఎదురైంది..నీ కోసం అక్కడకు వచ్చాను. "మీరిద్దరూ గుంటూరులో ఒకే రూములో ఉంటున్నారా." అని సారపాక పోస్ట్ మాన్ అన్నప్పుడు.. ఆ మాట నిజమైతే బాగుండేది అనిపించింది. ఆమాట నిజం అవదు అని తెలిసి బాధ అనిపించింది..నీ నుంచి ఒక్క ఫోన్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని.. ఎన్నాళ్ళైన ఎడురుచూసేవాడిని.. "నీతో ఫోన్ మాట్లాడే టైం నాకు లేదు. వీలున్నప్పుదు ఖచితంగా మాట్లాడతాను" అని ఒక్కసారి అయినా చెప్పావా.అలా చెప్పివుంటే నీ కోసం జీవితాంతం ఎదురు చూసేవాడిని."నిన్ను మర్చిపోలేదు. రోజూ గుర్తుచేసుకుంటున్నాను" అని ఇందాక చాట్ లో అన్నావ్. ఒకవేళ అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి అయినా నాకు ఫోన్ చేసి చేప్పావా? నేను నీకు గుర్తు వుంటే, నేనంటే నీకు ప్రాణం అయి వుంటే ఖచ్చితంగా నాకు చెప్పేదానివి. అలా జరగనప్పుడు.. నేను యేమని అనుకోవాలి.? నా నిరీక్షణకు, ఆశకు, కలలకు మోనం నీ సమాధానం ఐనప్పుడు నేనేమి చేయగలను..? ఇక ఎంత చెప్పినా వెస్ట్ సుధా..కాలం చేయిదాటి పొయింది. నీ తప్పిదమో, నా తప్పిదమో.. సినిమాల్లో చూపించినట్టు మరో జన్మ వుంటుందో లేదో నాకు తెలియదు. ఓ జర్నలిష్టుగా జీవితాని ముగిద్దం అనుకుంటున్నాను. కృష్ణవేనిని కూడా నాలాగే సబ్ ఎడిటర్ గా చేద్దామనుకుంటున్నాను.
ఓకే బాయ్...
బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాకు ప్రియమైన వాళ్ళ దగ్గరనుండి ఈరోజు మెయిల్ వస్తుందేమోనని ఎదురుచూశాను. ఏమో.. రెండు వారాలుగా అసలు మెయిల్ రాలేదు. ఒక్కటి మాత్రం నిజం.. ఏంటంటే.. మనం ఎదురు చూడడంలో ఆశ లేకపోలేదు. కానీ ఆ ఆశ నేరవేరాలన్న గ్యారెంటీ అంతకంటే లేదు. సరే.. రేపు కలుద్దాం.

Monday, October 24, 2011

బాధగా

ఏమోనండీ.. నాకూ చాలా బాధగా ఉంది. ఏమిచేస్తాం. మన లైఫ్ కూడా మన చేతిలో లేకుండా చేస్తున్నాడు ఆ దేవుడు. కానీ. ఒక నిజమేంటంటేనండీ. అనుభవమే గొప్ప గుణపాటం. నిజానికి ఈ విషయం నేను చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాను. కాదు కాదు తెలిసొచ్చింది. సరే.. ఈ రోజూ టైం ఐపాయింది. మళ్ళీ కలుద్దాం.

విరహం

ఇవ్వాళా రేపూ విరహం లేనిదెవరికి. అందరూ భగ్న ప్రేమికులేకదా.. వాళ్ళ కోసం ఓ బ్లాగ్ రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కానీ ఈ బిజీ లైఫ్ లో టైం ఎక్కడుంటుంది చెప్పండి.? అందుకే రాయలేక పోయాను. ఇప్పటినుంచి రాస్తాను. ఇక మీరే చదవాలి. ఓకేనా..